MLA Harish Rao : కాంగ్రెస్ సర్కార్ పై మరోసారి ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి

కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు...

Harish Rao : ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్‌కు (ఎల్ఆర్ఎస్‌) సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు. ‘‘డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తా”మని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు అంటూ విరుచుకుపడ్డారు.

MLA Harish Rao Slams

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థం అని అన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వలన రియల్ ఎస్టేట్ కుదేలైందని తాము ముందు నుంచే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు అని హరీష్‌రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి అంటూ హరీష్‌రావు హితవుపలికారు.

Also Read : CM Chandrababu : ఏపీ సీఎం భద్రతలో ఆరుగురు కౌంటర్ యాక్షన్ సిబ్బంది

Leave A Reply

Your Email Id will not be published!