MLA Harish Rao : తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి క్వాష్ పిటిషన్

ఇవాళ మరోసారి హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది...

Harish Rao : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు(Harish Rao) పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇప్పటికే హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హారీష్ రావును అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. హరీష్ రావు క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని పోలీసులు హైకోర్టును కోరారు. ఇవాళ మరోసారి హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

MLA Harish Rao Petition…

కాగా..ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న హరీశ్‌రావును అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. హరీశ్‌‌కు వ్యతిరేకంగా తమ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని.. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీశ్‌రావుపై జీ. చక్రధర్‌గౌడ్‌ పోటీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు చేశానని హరీశ్‌రావు తనపై కక్షగట్టి క్రిమినల్‌ కేసుల్లో ఇరికించారని, తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని చక్రధర్‌గౌడ్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హరీశ్‌రావును అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Deputy CM Pawan : నేడు పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!