YS Sharmila : ఈడీ, సీబీఐ లాంటి సర్కార్ సంస్థలన్నీ బిజెపి చేతుల్లో..
దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు...
YS Sharmila : బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంటోందని ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసేలే కుట్రలు చేస్తోందని.. చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారోయిందని మండిపడ్డారు. బీజేపీ దళితులంటే చిన్నచూపన్నారు. రాజ్యాంగ నిర్మత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కమలంపార్టీ అవమాన పాలు చేసిందని విమర్శించారు. శనివారం షర్మిల(YS Sharmila) మీడియాతో మాట్లాడుతూ.. మతం, కులం పేరుతో బీజేపీ దేశంలో రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు.సీబీఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. ఆ వ్యవస్థ లను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మాగాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Slams..
అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గం వైపు బీజేపీ పాలన సాగుతుందన్నారు. చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. అంబేద్కర్ను కూడా వదలకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజంలో జస్టీస్, సమానత్వం ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణమని చెప్పుకొచ్చారు. ఆయన్ను కూడా పార్లమెంటులో ఎంత హేళన చేశారో చూశామన్నారు. దళితులు అంటేనే చిన్న చూపు బీజేపీకి అని విమర్శించారు. కుల గణన విషయంలో కూడా బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది తేలిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీరి ముగ్గురు మాట్లాడరన్నారు. అంబేద్కర్ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read : MLA KTR : సుంకిశాల ఘటన…సీఎంకు మేఘా సంస్థకు చీకటి ఒప్పందం