CM Fadnavis : శరద్ పవార్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మహారాష్ట్ర సీఎం

ఆర్ఎస్ఎస్‌పై శరద్ పవార్ పొగడ్తలకు స్పందిస్తూ..

CM Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(CM Fadnavis) స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘మహా వికాస్ అఘాడి’ చేసిన తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా జాతీయ శక్తులన్నీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

CM Fadnavis Comment

”మహారాష్ట్రఎన్నికల్లో అరాచకవాదవాద శక్తులకు వ్యతిరేకంగా జాతీయ శక్తులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విచార్ పరివార్‌కు మేము విజ్ఞప్తి చేశాం. ఆర్ఎస్ఎస్ విచార్ పరివార్‌ అందించిన సహకారంతో మహా వికాస్ అఘాడి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాం. దీంతో లోక్‌సభ ఎన్నికలకు భిన్నమైన ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో రాబట్టాం” అని నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్ఎస్ సీనియర్ నేత విలాస్ ఫడ్నవిస్ స్మారక అవార్డు కార్యక్రమంలో ఫడ్నవిస్(CM Fadnavis) పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో లోక్‌సభ ఎన్నికల్లో సక్సెస్ కావడంతో ‘మహా వికాస్ అఘాడి’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించినందని ఫడ్నవిస్ అన్నారు. ఆర్ఎస్ఎస్‌పై శరద్ పవార్ పొగడ్తలకు స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని, అందుకే ఆయన ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించి ఉండొచ్చని అన్నారు.

శరద్ పవార్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్‌కు నిబద్ధత కలిగిన కార్యకర్తలున్నారని, సంస్థ సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరని అన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 132 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది.

Also Read : Minister Sharan Prakash : సీజనల్ ఆరోగ్య సమస్యలకు ఐఎంఆర్ కొత్త లేబరేటరీ

Leave A Reply

Your Email Id will not be published!