TTD Crowd : వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులతో కిక్కిరిసిన తిరుమల
కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు...
TTD : సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ(TTD) అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది. 18వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను గురువారం భక్తులకు టీటీడీ అధికారులు జారీ చేస్తున్నారు. కాగా ఆరు రోజుల్లో నాలుగు లక్షల 8 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
TTD Crowd Updates
కాగావైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజాము 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు వీఐపీలకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించారు. ఆ తర్వాత సర్వదర్శనం భక్తులను అనుమతించారు. స్లాట్లవారీగా అర్థరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలను కల్పించారు. ఇక, వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ తిరుమలలో మోస్తరుగానే భక్తుల రద్దీ కొనసాగింది. ఏకాదశి సందర్భంగా ఉదయం స్వర్ణరథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంలో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక, శ్రీవారి ఆలయం ముందు ఎక్కడికక్కడ గేట్లు వేయడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. శనివారం ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
Also Read : Mahakumbh Mela-Trains : 4 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే