Mukesh Ambani : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అంబానీ ఫ్యామిలీ
నీతా,ముఖేష్ అంబానీ ఈనెల 18న వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు.
Mukesh Ambani : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు, కీలక నేతలు, వాణిజ్య దిగ్గజాలు హాజరుకానున్నారు. జనవరి 20న అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ప్రాంతం ఇందుకు వేదిక కానుంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani), రిలయెన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ట్రంప్ కేబినెట్ నామినీలు, ఎన్నికైన అధికారులతో కలిసి వీరు వేదిక పంచుకోనున్నారు.
Mukesh Ambani and his Wife Visit…
నీతా,ముఖేష్ అంబానీ ఈనెల 18న వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. ట్రంప్ ఇనాగరల్ ఈవెంట్స్ శనివారంనాడు రెసెప్షన్, బాణసంచా ప్రదర్శనతో వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మొదలవుతాయి. క్యాబినెట్ రెసెప్షన్, ఉపాధ్యక్షుడు ఏర్పాటు చేసే డిన్నర్‌లోనూ అంబానీలు పాల్గొంటారు. ఇనాగరేషన్‌కు ముందు జరిగే ‘క్యాండిల్‌లైట్ డిన్నర్’లో ట్రంప్, ఉపధ్యక్షుడిగా ఎంపికైన జేడీ, ఉషా వాన్సెలతో కలిపి వీరు పాల్గొంటారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో ‘ఎక్స్’ బిలియనీర్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బెర్గ్, పలువురు టెక్ జెయింట్స్ ఉన్నారు. భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ట్రంప్ గతంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా 2017 నుంచి 2021 వరకూ పనిచేశారు.
Also Read : Minister Kishan Reddy : భారత్ ను విశ్వగురువుగా నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యం