BRS vs Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా కేటీఆర్ రాజీనామా అస్త్రాన్ని వెలికితీశారు...
Congress: ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు.. ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్రంగా భావిస్తుంది. తాజాగా కేటీఆర్(KTR) రాజీనామా అస్త్రాన్ని వెలికితీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామన్నారు. మరోవైపు కేటీఆర్ కేసులను ఎదుర్కోలేక రోజుకో సవాల్ విసురుతున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
BRS vs Congress Challenges
కాంగ్రెస్‌ను కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములా ఫాలో అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్(BRS) నేతలు. హామీలు అమలు చేయాలని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గులాబీ నేతలు. కేసుల విషయంలో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ మొన్న సవాల్ విసిరిన కేటీఆర్.. తాజాగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఏ ఒక్క గ్రామంలోనైనా రేవంత్ సర్కార్ వంద శాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు కేటీఆర్. పార్టీమారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. బై పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.. కాగా.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది.. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసు విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ ఒత్తిడిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ సవాళ్లపై కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ కేటీఆర్ తెరపైకి తెచ్చిన రాజీనామా అస్త్రం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Also Read : Minister Amit Shah : బెజవాడలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి