Ex Minister Kakani : పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్
ఓ మహిళ ఫిర్యాదుతో వెంకట శేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు...
Ex Minister Kakani : వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోగోలు మండలం, కోళ్లదిన్నెలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు జరిగాయి. గాయాలైన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో వైఎస్సార్సీపీ శ్రేణులు కత్తులు చేతపట్టి హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణలో మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో కావలి ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి కాకాణి(Ex Minister Kakani) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారంటూ కాకాణి రివర్స్ ఎటాక్ చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని.. పోలీసులు సప్తసముద్రాల అవతల ఉన్నా, లాక్కొచ్చి, ఒంటి మీద బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేపటి రోజున పోలీసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో గుర్తు చేసుకోవాలంటూ హెచ్చరిక చేశారు.
Ex Minister Kakani Govardhan Reddy Fires
మూడు వారాల క్రితం కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి(Ex Minister Kakani) పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో తన ముఖ్య అనుచురుడిపై కేసు పెట్టారంటూ ఆయన బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఏకంగా పోలీసు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల కాకాణి ముఖ్య అనుచురుడు వెంకట శేషయ్యపై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. ఓ మహిళ ఫిర్యాదుతో వెంకట శేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక లైన్మెన్ చనిపోతే భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చాలా కాలంగా మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉద్యగం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా నడుచుకున్నారని, లైంగిక వేధింపులు కొనసాగించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వెంకట శేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు కూడా తరలించారు.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కాకాణి(Ex Minister Kakani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై, రెవెన్యూ సిబ్బందిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జగన్ సీఎం కాకూడదని, తాను గెలవకూడదని సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి ప్రతిరోజూ దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఖాకీ దుస్తులు ఊడదీసి పసుపు దుస్తులు ధరించి చంద్రబాబు, లోకేష్ వెంట, టీడీపీ నేతలు వెనుక తిరగాల్సిందేనంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. సీఐ, ఆర్ఐలు శాశ్వతంగా విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఏకంగా పోలీసులనే ఈ తరహాలో కాకాణి బెదిరిండం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
Also Read : Neeraj Chopra : ఘనంగా ఒలింపిక్ విజేత ‘నీరజ్ చోప్రా’ పెళ్లి వేడుకలు