Indian Death USA : అమెరికాలో మరో తెలుగు యువకుడు ‘రవితేజ’ మృతి
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు...
Indian Death USA : అమెరికాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. దుండగుల తూటాలకు ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. ఉన్నత విద్య కోసం, ఉజ్వల భవిష్యత్ కోసం స్వదేశాన్ని వీడి అమెరికా(America)కు వెళ్తుంటారు ఎందరో. అక్కడే ఎంతో కష్టపడి చదువుకోవడమే కాకుండా.. ఉద్యోగాలు సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లిన ఎంతో మంది.. అక్కడి దుండగుల ఆకృత్యాలకు బలయ్యారు. తాజాగా ఉన్నత చదవుల కోసం వెళ్లిన ఓ యువకుడు.. తన కలలు నెరవేరకుండానే ఓ దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఎవరా యువకుడు.. అమెరికాలో ఏం జరిగింది.. ఇప్పుడు చూద్దాం.
Indian Death USA Today..
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన రవితేజ(Ravi Teja)గా గుర్తించారు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటోంది. 2022 మార్చిలో రవితేజ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు రవితేజ. ఇంతలోనే దుండగుల తూటాలకు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని వాషింగ్టన్ ఏస్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ కన్నుమూశాడు. రవితేజ మృతితో ఆర్కేపురంలో విషాదఛాయులు అలముకున్నాయి.
Also Read : Ex Minister Kakani : పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్