Minister Seethakka : పీర్జాదిగూడలో మంత్రి సీతక్కకు ప్రజల నిరసనలు

మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో మంత్రి వారితో మాట్లాడారు...

Minister Seethakka : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. బుధవారం మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో డంపింగ్‌ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం) యంత్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. డంపింగ్‌ యార్డును తొలగించాలంటూ ఎంతో కాలంగా తాము డిమాండ్‌ చేస్తుంటే.. ఇక్కడే మరో కొత్త యంత్రాన్ని ప్రారంభిస్తారా అంటూ ప్రశ్నించారు.

Minister Seethakka Comments

డంపింగ్‌ యార్డు కారణంగా తాము, తమ పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా స్థానిక బీజేపీ నేతలు కూడా నిరసనకు దిగారు. మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో మంత్రి వారితో మాట్లాడారు. డంపింగ్‌ యార్డు సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా ఆందోళనకారులు శాంతించకపోవడంతో మేడిపల్లి పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. స్థానికుల ఆందోళనల మధ్యనే మంత్రి సీతక్క(Minister Seethakka) ఐటీసీ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఎస్‌డబ్ల్యూఎం యంత్రాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల నుంచి పోగవుతున్న ఘన వ్యర్థాలను అధునాతన పద్ధతుల్లో నిర్వీర్యం చేసి తిరిగి ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్‌ అమర్‌సింగ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

Also Read : MLA Danam Nagender : చింతల్‌బస్తీ ఆక్రమణల తొలగింపుపై భగ్గుమన్న ఎమ్మెల్యే

Leave A Reply

Your Email Id will not be published!