KTR Slams : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన కేటీఆర్

అలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం...

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి తనను ఐటీ ఉద్యోగి అంటూ మాట్లాడడంపై కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. తనను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నా.. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి ఎంతో అవసరం అని మాజీ మంత్రి చెప్పారు. కానీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బుల సంచులు పంపడానికి ఇవేమీ అవసరం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Slams CM Revanth Reddy

ఈసందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ..”ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం.. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలు, నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పొలిటీషియన్‌ను కాబట్టి పాలసీ మేకర్‌లాగా ఉంటానని, కేటీఆర్ ఐటీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆయన ఆలోచనలు ఓ ఉద్యోగి లాగానే ఉంటాయని వ్యాఖ్యానించారు.

Also Read : Delhi Elections-PM Modi : జనవరి 29 నుంచి ఢిల్లీ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!