Dil Raju – IT Raids : ఎఫ్డిసి చైర్మన్ ఇంట్లో ముగిసిన సోదాలు..కీలక అంశాలు వెలుగులోకి

నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు...

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు దిల్‌ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్‌రాజు(Dil Raju)ను శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు(Dil Raju) కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లీగల్ ఫార్మల్టీస్‌ను ఐటీ పూర్తి చేస్తోంది. దిల్ రాజ్ ఇళ్లు, కార్యాలయంతో పాటు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లో సీజ్ అయిన పత్రాలను అధికారులు వెరిఫై చేస్తున్నారు.

Dil Raju – IT Raids Update

అలాగే టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా కీలక అంశాలను గుర్తించింది ఐటీ. భారీగా నిధులు తరలించినట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది. గత రెండేళ్లుగా దిల్‌రాజు(Dil Raju) బ్యానర్‌లో నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టారు. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండటం.. వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు కూడా పెద్ద మొత్తంలో వ్యత్యాసాన్ని గుర్తించింది ఐటీ. ఈ క్రమంలో టాలీవుడ్‌ ఇండస్ట్రీపై ఐటీ శాఖ విరుచుకుపడినట్లు తెలుస్తోంది.పుష్ప 2 సినిమాకు సంబంధించిన నిర్మాతల ఇళ్లలో కూడా దాదాపు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.

రూ.1800 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ పన్నుల చెల్లింపులు తక్కువగా ఉన్నట్లు ఐటీ నిర్ధారించింది. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ దాడులు చేసింది. గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ఆదాయం ఎక్కువగా వచ్చిందని ప్రకటించిన నిర్మాతల ఇళ్లలోనే ఐటీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకకాలంలో పెద్ద బ్యానర్స్‌ ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈరోజు మధ్యాహ్నం తరువాత ఐటీ శాఖ అధికారులు దాడులకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ సోదాలపై నిర్మాత దిల్‌ రాజు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : AP News : కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి నారాయణ విద్యార్థి ఆత్మహత్య

Leave A Reply

Your Email Id will not be published!