Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్
పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళికలు తీసుకొచ్చాం...
Budget 2025 : 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రసంగం.. ఆమె మాటల్లోనే.. ‘‘అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ నిలిచింది. ఆరు రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. రైతులు, మహిళలు, పేదవర్గాల అభివృద్ధి, పేదరికం నిర్మూలనే మా లక్ష్యం. సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించాం. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి’’.
Budget 2025 Updates
‘‘పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళికలు తీసుకొచ్చాం. ప్రయోగాత్మకంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొస్తున్నాం. దీని ద్వారా మొత్తం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి పెట్టాం. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించాం. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నాం. అలాగే అధిక దిగుబడి విత్తనాల కోసం ప్రత్యేక ప్రణాళికలు తీసుకొస్తున్నాం’’..
‘‘అదేవిధంగాకిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నాం. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకాన్ని తీసుకొచ్చాం. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాలు కల్పిస్తున్నాం. అలాగే దేశంలో కొత్తగా 3 యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం’’.. అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Also Read : PM Modi : ఈ బడ్జెట్ మహిళలు మరియు యువతకు ఆశాకిరణం