Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు
Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు రోజున రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన ప్రకారం రాష్ట్రంలో తొలిసారి రోడ్డు భద్రత మాసాన్ని నిర్వహించామన్నారు.
Minister Ponnam Prabhakar Comments
యువత,విద్యార్థులు, వాహనదారులు, ప్రయాణికులను భాగస్వాములను చేసి పెద్దఎత్తున ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు పాఠ్యాంశాలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ లేకుండా చేస్తామని మంత్రి హెచ్చరించారు. రవాణా లేకుంటే జీవితాలు లేవని, రాబోయే రోజుల్లో ట్రాఫిక్, రవాణా నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.
నెలరోజులపాటుఅవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని మంత్రి పొన్నం అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీలు, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్