CM Chandrababu : ఏపీ రైతన్నలకు రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం
గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టిందని అన్నారు...
CM Chandrababu : రైతు భరోసాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు.అన్నమయ్య జిల్లాలో ఇవాళ(శనివారం) సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈరోజు సీఎం చంద్రబాబు(CM Chandrababu) పంపిణీ చేశారు. సంబేపల్లి మండలం మోటకట్లలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాటామంతీ నిర్వహించారు. సంబేపల్లి క్రాస్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీడియాతో మాట్లాడారు.
CM Chandrababu Comment
గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టిందని అన్నారు. భయం అనేది తన జీవితంలో లేదని చెప్పారు. వంద దేశాల్లో తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారని గుర్తుచేశారు. వర్క్ ఫ్రమ్ హోంను నైబర్‌హుడ్ హోంగా చేస్తామని స్పష్టం చేశారు. ఏ పంటకు రేటు పడిపోయినా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని తెలిపారు.తంబళ్లపల్లి నుంచి రాయచోటికి కెనాల్ రావాలని అన్నారు. రాయలసీమ ఈ స్థాయిలో ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాయలసీమకు ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ఆరోపించారు. పోలవరానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.
రూ.1000 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి రూ.12వేల కోట్లు మంజూరు చేశారని చంద్రబాబు తెలిపారు.2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్నారు. గత జగన్ ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందని ఆరోపించారు. అప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తన మాట మీద నమ్మకంతో అమరావతి రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. సంపద వల్ల ఆదాయం వస్తుందని తెలిపారు.44 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ పెంచిన ఘనత మనదేనని సీఎం చంద్రబాబు తెలిపారు.పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ఆరోపించారు. పోలవరానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెయ్యి కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి.. రూ.12వేల కోట్లు మంజూరు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read : Union Budget 2025-26 AP : ఏపీ జీవనాడి పోలవరానికి 30,436 కోట్ల కేటాయింపు