KP Chowdhary : అనారోగ్యంతో కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిర్మాత కేపీ చౌదరి

కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది...

KP Chowdhary : సినీ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఇవాళ(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు. ఆనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా కేపీ చౌదరి(KP Chowdhary) ఉన్నారు. చాలా మంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ అందజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Producer KP Chowdhary No More

అయితే,డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని గతంలో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసుల దర్యాప్తు చేశారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి.

కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహారం వెలుగు చూసింది. ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫొటోలు సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్‌ను పోలీసులు తయారు చేశారు. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరికి సంబంధించిన 4 మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 4 ఫోన్‌ల నుంచి కాల్ డేటా తీస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు.. ఒక డైరెక్టర్‌తో డ్రగ్స్ వ్యవహారంపై కేపీ చౌదరి చేసిన చాటింగ్‌ను గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

Also Read : AP MLC Elections : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..ఈ నెల 27న పోలింగ్

Leave A Reply

Your Email Id will not be published!