BRS : ఆ ఎన్నికలకు పోటీ నుంచి తప్పుకోనున్న కారు పార్టీ

గతంలో కూడా ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని నెలబెట్టలేదు...

BRS : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్(BRS) దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నా అభ్యర్థిని గులాబీ బాస్ ఇంతవరకు ప్రకటించలేదు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. నేతలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పార్టీలో చేరి పోటీ చేద్దామనుకున్న ప్రసన్న హరికృష్ణకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కాగా మాజీ మేయర్ రవీందర్‌కు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. గతంలో కూడా ఈ స్థానంలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థిని నెలబెట్టలేదు. కొందరు ఆశవహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు తెలియవచ్చింది.

BRS Party…

కాగా మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్‌రూం, బ్యాలట్‌ బాక్స్‌ల నిర్వహణ తదితర ఏర్పాట్లను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలోని ఇండోర్‌ స్టేడియంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటుపై పోలీసు అధికారులతో చర్చించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం బ్యాలెట్‌ బాక్స్‌లు ఉపయోగించనున్న నేపథ్యంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్స్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. బ్యాలెట్‌ బాక్స్‌లకు ఆయిల్‌ లూబ్రికేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓలు మహేశ్వర్‌, రమేష్‌, ఏవో సుధాకర్‌ పాల్గొన్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సెలవు దరఖాస్తు, మంజూరును ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. టీం ఇండియా సంస్థ సీఈవో చైతన్య ఆధ్వర్యంలో ఈ లీవ్‌ మేనేజిమెంట్‌ పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేపర్‌ వర్క్‌ తగ్గించేందుకు, సెలవు మంజూరులో పారదర్శకత కోసం ఈ పోర్టల్‌ రూపొందించామన్నారు. అధికారులు, ఉద్యోగులు సెలవు కోసం ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేస్తే జిల్లా యంత్రాంగం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రంజిత్‌రెడ్డి, లక్ష్మిప్రసన్న, అనిల్‌శర్మ పాల్గొన్నారు.

Also Read : TTD News : శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త

Leave A Reply

Your Email Id will not be published!