CM Chandrababu-DSC 2025 : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు...

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలం సాగదీస్తుంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో పాటు విద్యామంత్రి నారా లోకేష్ కూడా రోజుకో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు. కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యచరణ రూపొందిచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అలాగే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.

CM Chandrababu Comments Viral

రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్‌లో చర్చ జరిపారు. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోస పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సన్న బియ్యం తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Also Read : AP Assembly Session: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Leave A Reply

Your Email Id will not be published!