MLA KTR : చిలుకూరు పూజారి పై జరిగిన దాడిపై స్పందించిన మాజీ మంత్రి
ఈనెల 7 తేదీన దాడి ఘటన జరిగినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు...
KTR : రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు చెందిన 20 మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని..అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర్ రాజన్ తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
MLA KTR Comments
ఈనెల 7 తేదీన దాడి ఘటన జరిగినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల తర్వాత విషయం బయటపడ్డం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు..బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ” ధర్మరక్షకులపై దాడులు చేస్తారు…రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు” అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా.. హోం మంత్రి? ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Arvind Kejriwal : ఆప్ ఎమ్మెల్యేలను చాయ్ మీటింగ్ కు పిలిచిన కేజ్రీవాల్