TG News : చిలుకూరు పూజారిపై దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి

దాడికి పాల్పడే ముందు యాప్రాల్‌లో కలిసి నిందితులు ఫొటోలు దిగారని చెప్పారు...

TG News : మొయినాబాద్ మండలం చిలుకూరు శ్రీబాలాజీ ఆలయ(Chilkur Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ కేసులో కీలక నిందితును మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి సంబంధించిన వివరాలను మీడియాకు మొయినాబాద్ పోలీసులు వెల్లడించారు.రంగరాజన్‌(Rangarajan)పై దాడి చేసిన వారు చిలుకూరుకు మూడు వాహనాల్లో వెళ్లి రంగరాజన్‌పై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడే ముందు యాప్రాల్‌లో కలిసి నిందితులు ఫొటోలు దిగారని చెప్పారు. నల్లని దుస్తులు ధరించిన 20 నుంచి 25 మంది రంగరాజన్ నివాసానికి మూడు వాహనాల్లో వచ్చారని అన్నారు.

TG News-Chilkur Balaji Temple Priest Attack…

ఆర్థికంగా మద్దతు ఇవ్వడంతో పాటు “రామరాజ్యం ఆర్మీ”లో వ్యక్తులను రిక్రూట్ చేయాలంటూ రంగరాజన్‌ను నిందితులు డిమాండ్ చేశారని చెప్పారు. రంగరాజన్‌పై దాడి కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను మొయినాబాద్ పోలీసులు ప్రస్తావించారు. కౌసలేంద్ర ట్రస్ట్ పేరుతో వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారని తెలిపారు. రామరాజ్యంలో మొదటి దఫాలో 5000 మందిని రిక్రూట్‌మెంట్ చేసుకోవాలని ప్లాన్ చేశారని అన్నారు.రామరాజ్యం ఆర్మీ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల నుంచి డొనేషన్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి రూ. 1,20,599ల డొనేషన్‌ను వీర రాఘవరెడ్డి ఫిక్స్ చేశాడు. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నాడని తెలిపారు.

ప్రతి నెల రూ.20 వేల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని వీర రాఘవరెడ్డి హామీ ఇస్తున్నారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రామరాజ్యం ఆర్మీ రిజిస్ట్రేషన్లను వీర రాఘవరెడ్డి చేయించారని అన్నారు. ఐదు కిలోమీటర్ల నడవగల శక్తి ఉన్నవారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో చేర్చుకుంటున్నాడని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు రూ.350లు రుసుమును వీర రాఘవరెడ్డి వసూలు చేశాడు. సీఆర్పీసీ 340ను న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదిస్తోంది. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని రామరాజ్యం ఆర్మీ ఆరోపించింది. న్యాయవ్యవస్థ కేవలం క్రిమినల్స్‌కే తప్ప సామాన్యులకు కాదు అంటూ రామరాజ్యం ఆర్మీ వాదిస్తోందని మొయినాబాద్ పోలీసులు వెల్లడించారు.

Also Read : Mukesh Ambani : మరో కొత్త వ్యాపార రంగంలోకి దిగ్గజ వ్యాపారవేత్త

Leave A Reply

Your Email Id will not be published!