Gujarat Titans : 2025 ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే మారిన గుజరాత్ టైటాన్స్ ఓనర్
పాపులర్ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మారిందని తెలుస్తోంది...
Gujarat Titans : ఐపీఎల్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిశాక అందరి ఫోకస్ ఐపీఎల్ వైపు మళ్లనుంది. అయితే లీగ్ ఆరంభానికి ముందు బిగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పాపులర్ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యం మారిందని తెలుస్తోంది.మన దేశంలో బడా కంపెనీల్లో ఒకటైన టోరెంట్ గ్రూప్ జీటీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం.
Gujarat Titans New Owner
గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో దాదాపుగా 67 శాతం వాటాను కొనుగోలు చేయనుందట టోరెంట్ గ్రూప్. ఈ మేరకు జీటీకి అసలు ఓనర్స్ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ నుంచి వాటాను కొనుగోలు చేయనుందట టోరెంట్ గ్రూప్. లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఈ విషయంపై ఫైనల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నారట. గవర్నింగ్ కౌన్సిల్ ఓకే చెప్పాకే టోరెంట్ గ్రూప్ వాటాపై స్పష్టత రానుందని సమాచారం. ఐపీఎల్-2025 ఆరంభానికి ముందే వాటాల మార్పు వ్యవహారం ఓ కొలిక్కి రానుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఐపీఎల్ కొత్తత్త సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్‌లో టోరెంట్ గ్రూప్ హవా నడవనుందని తెలుస్తోంది.కొత్త ఓనర్స్ రాకతో జట్టుపై హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా పెత్తనం మరింత పెరగనుందని సమాచారం. గత యజమానులకు నెహ్రాకు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఐపీఎల్-2025కి ఆయన వేరే టీమ్‌కు మారతాడని కూడా వినిపించింది. అయితే మొత్తానికి అందులోనే కొనసాగుతున్నాడు నెహ్రా. ఇప్పుడు కొత్త ఓనర్స్ రాకతో టీమ్ వ్యవహారాలు మొత్తం హెడ్ కోచ్ చూసుకుంటారని తెలుస్తోంది.
Also Read : భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం ప్రపంచానికే మూలకారణం