Deputy CM Pawan Visit : కీలక అంశాలపై కేరళ ఆలయాల్లో డిప్యూటీ సీఎం పర్యటన

మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు...

Deputy CM Pawan : దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా మరియు టీటీడీ సభ్యుడు ఆనంద్‌సాయి కూడా ఉన్నారు.

Deputy CM Pawan Visit

పవన్ కల్యాణ్‌ 4 రోజులపాటు 11 ఆలయాలను దర్శించుకునే ప్రణాళికను రూపొందించారు. ఈ టెంపుల్ టూర్‌ కోసం పవన్ కల్యాణ్‌ దీక్ష వస్త్రాలు కూడా ధరించారు.

అలాగే, తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్‌ దాన్ని దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఆలయాలు అనుభవిస్తున్న లాభాలు ఇతరులు ఆశించకూడదన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు అరెస్ట్‌ అయ్యారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read : Prashant Kishor : ఎన్నికలకు టీవీకే పార్టీ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్

Leave A Reply

Your Email Id will not be published!