Ernakulam Express Incident : ఎర్నాకులం ఎక్ష్ప్రెస్స్ కు తప్పిన భారీ ప్రమాదం
పగుళ్లు ఏర్పడిన వంద మీటర్ల దూరంలో రైలు నిలిచింది...
Ernakulam Express : కరూర్ జిల్లా తిరుకాంబులియూర్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఏర్పడిన పగుళ్లను సకాలంలో గుర్తించడం వల్ల, ఎర్నాకుళం-కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.
Ernakulam Express Incident Updates
మంగళవారం ఉదయం, రైలు పట్టాలపై పగుళ్లు ఉన్నట్లు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కలియమూర్తి గుర్తించాడు. ఆయన వెంటనే గ్యాంగ్‌మెన్‌లకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అదే సమయంలో, వస్తున్న ఎర్నాకుళం-కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్‌ను గ్యాంగ్‌మెన్‌లు ఎర్రజెండా చూపించి నిలిపివేశారు. పగుళ్లు ఏర్పడిన వంద మీటర్ల దూరంలో రైలు నిలిచింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు, వాస్కోడిగామా-వేలాంకన్ని ఎక్స్‌ప్రెస్ మాయనూరు రైల్వేస్టేషన్‌లో, కరూర్-తిరుచ్చి అన్ రిజర్వడ్ రైలు వీరాక్కియం రైల్వేస్టేషన్‌లలో నిలిపివేశారు. కార్మికులు పగుళ్లను సరిచేసి, 45 నిమిషాలు ఆలస్యంగా ఎర్నాకుళం-కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్ తిరిగి బయలుదేరింది.
Also Read : కీలక అంశాలపై కేరళ ఆలయాల్లో డిప్యూటీ సీఎం పర్యటన