8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన కేంద్రం
ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి వ్యయ ప్రభావం ఉంటుందని..
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం(8th Pay Commission) ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో అమలు చేయడానికి తగినంత సమయం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వేతన సంఘం జనవరి 1, 2026 నాటికి ఏర్పాటయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భరించే ఖర్చుల గురించి బడ్జెట్ 2025 పత్రాల్లో ఎటువంటి ప్రస్తావన లేదని వివరిస్తన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించిన తర్వాత కమిషన్‌కు ఎలాంటి కేటాయింపులు లేనట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.
8th Pay Commission Updates
2026లోఏడో వేతన సంఘం గడువు ముగిసిన తర్వాత 8వ వేతన సంఘం(8th Pay Commission) అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణ మూల్యాంకనాలను నిర్వహించడానికి వేతన కమిషన్లు 10 సంవత్సరాల సాధారణ ప్రక్రియగా మారాయి. ఏడో వేతన సంఘం అమలు తేదీ 2016లో జరిగింది కాబట్టి 8వ వేతన సంఘం సిఫార్సులు 2026లో అమలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. వేతన కమిషన్లు తమ సిఫార్సులను సమర్పించడానికి సాధారణంగా ఒక సంవత్సరం పడుతుంది. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి వ్యయ ప్రభావం ఉంటుందని వ్యయ కార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవ ఆర్థిక సర్దుబాట్లు వాయిదా వేసే అవకాశం ఉందని నిపుణులు
8వవేతన కమిషన్ సిఫార్సులు అనివార్యమైనప్పటికి వాటి సమయం ప్రభుత్వ ఆర్థిక విధానంపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన కేటాయింపు లేకుండా జనవరి 2026 నుంచి పూర్తి స్థాయి జీతాల పెంపు అనేది అసంభవమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘం ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. కమిషన్ ఏర్పాటుకు అధికారిక తేదీ లేనందున, కమిషన్ అమలుకు తాత్కాలిక తేదీని నిర్ధారించడం కష్టమని భావిస్తున్నారు అయితే కమిషన్ అమలు తేదీని జనవరి 1, 2026 కంటే తరువాత తేదీకి వాయిదా వేసే అవకాశం ఉందరని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వేతన సంఘ ఏర్పాటు ఆలస్యమైనా ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాల్లో ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు. వేతన సంఘం సిఫార్సుల్లో పేర్కొన్న తేదీ మేరకు బకాయిలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
Also Read : 2008 డిఎస్సి అభ్యర్థులకు భారీ ఉరటనిచ్చిన హైకొర్టు