Kamal Haasan-DMK Party : కమల్ హాసన్ కు కీలక పదవి కట్టబెట్టనున్న డీఎంకే సర్కార్

కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా....

Kamal Haasan : మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. కేబినెట్‌లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు సమాచారం.ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌(Kamal Haasan)ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాకాలు చేస్తోంది.

అయితే గతేడాది మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. ఆ క్రమంలో కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే(DMK Party) అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా సూచనలతో ఎన్నికల బరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ఆయన విరమించుకొన్నారు.

DMK Party Offers… Kamal Haasan

ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తురు లోక్ సభ స్థానం నుంచి తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులోభాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందనే సమాచారం.

Also Read : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!