CM Revanth Vs BJP : ప్రధాని కులంపై సీఎం కీలక వ్యాఖ్యలు..భగ్గుమన్న బీజేపీ నేతలు

స‌ర్టిఫికెట్ ప్రకార‌మే మోదీ బీసీ అని....

CM Revanth: తెలంగాణలో కులాల కొట్లాట ఆగడం లేదు. మొన్నటి వరకు బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారని రచ్చ రేగింది. ఇటు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో తక్కు వ సంఖ్య ఉన్న మాలలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారని దుమారం రేగింది. తాజాగా తెలంగాణ నేతలు ఈ కులాల కుంపటిలోకి దేశ ప్రధానిని లాగారు. ప్రధాని నరేంద్ర మోదీ కుంలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) హార్ష్‌ కామెంట్స్‌ చేసి కులకలం రేపారు.

హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో నిర్వహించిన కుల‌గుణ‌న‌, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌లో ప్రధాని టార్గెట్‌గా రేవంత్ చేసిన కామెంట్స్ చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) బాంబ్ పేల్చారు. 2002 వ‌ర‌కు మోదీ ఉన్నత వ‌ర్గమేనని అయితే మోదీ గుజ‌రాత్ సీఎం అయ్యాకే, ఆయ‌న కులాన్ని బీసీల్లో క‌లిపార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయాల‌న్నీ తెలుసుకునే మాట్లాడుతున్నట్టు రేవంత్ చెప్పుకొచ్చారు. స‌ర్టిఫికెట్ ప్రకార‌మే మోదీ బీసీ అని.. మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకుల‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

CM Revanth Reddy Shocking Comments

కులగణన చేస్తే బీసీలకు ఎక్కువ పదవులు దక్కుతాయని బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహాలో కులగణన చేయాలని సీఎం రేవంత్ అన్నారు. మోదీ బీసీ వ్యతిరేకి కాబట్టే కేంద్ర ప్రభుత్వం కులగణన ఊసెత్తడం లేదని రేవంత్ విమర్శించారు. ఇటు రేవంత్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) నేతలు ఫైరయ్యారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని.. కానీ 1994లోనే గుజరాత్‌లోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని.. అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ప్రధాని కన్వర్టెడ్ బీసీ అంటూ రాహుల్ గతంలో చేసిన కామెంట్స్‌నే రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కులం ఏంటో, మతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు…మొత్తానికి ప్రధాని కులంపై అటు రేవంత్ వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్లతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

Also Read : Minister Srinivasa Varma :స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ

Leave A Reply

Your Email Id will not be published!