Kesineni Nani : తన రాజకీయ రిటైర్మెంట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ
సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని...
Kesineni Nani : ఇటీవల మీడియా ఊహాగానాలపై మాజీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ రిటైర్‌మెంట్ గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని.. ఆ నిర్ణయం మారదని అన్నారు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్నారు.
Kesineni Nani Comment
ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని.. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు. తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని అందరినీ కోరుతున్నానని అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దాని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందని, తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలుపుతిన్నానని.. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నానని కేశినేని స్పష్టం చేశారు.
Also Read : US 3rd Army Flight-Indians : మూడవసారి 112 మంది తో అమృత్సర్ లో ల్యాండ్ అయిన యూఎస్ ఆర్మీ ఫ్లైట్