MP Eatala Rajender : మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ పై భగ్గుమన్న మల్కాజ్గిరి ఎంపీ

జాతీయ రహదారుల కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని....

Eatala Rajender : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. ఇలాగే చేస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు కూడా పడుతుందని హెచ్చరించారు ఈటెల రాజేందర్(Eatala Rajender). బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. అదే తరహాలో కాంగ్రెస్ నడుస్తోందన్నారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు 3 రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈటల ఆరోపించారు.

MP Eatala Rajender Slams

జాతీయ రహదారుల కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని.. కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. గ్రీన్ ఫిల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రీన్ ఫిల్డ్ భూ నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. గ్రీన్ ఫిల్డ్ హై వే పనులు వేగంగా జరుగుతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఈటల విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్లు తెరవాలని హితవు చెప్పారు ఎంపీ.

ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని ఎంపీ ఈటల ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసే పరిస్థితి లేదని ఈటల స్పష్టం చేశారు.కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనకు చట్టబద్ధత ఉందా? అని ఎంపీ ప్రశ్నించారు. తమిళనాడులో చేసిన విధంగా చేస్తే స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Also Read : Ex CM KCR : బీఆర్ఎస్ పార్టీ కీలక అంశాలపై చర్చకు తెలంగాణ భవన్ కు కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!