AP CM-Deputy CM Meet : కేంద్ర మంత్రి పాటిల్ తో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కీలక భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు...
AP CM-Deputy CM Meet : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
AP CM-Deputy CM Meet Meet..
ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) ట్వీట్ చేశారు. సీఆర్ పాటిల్‌తో ఫలవంతమైన సమావేశం జరిగిందని చెప్పారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంటీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపే లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలని చర్చించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని చెప్పారు. 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పడుతుందని, 9.14 లక్షల హెక్టార్లకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 20 టీఎంసీలు నీరు పరిశ్రమలకు అందించగలుగుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బాంగ్లాదేశ్ తో తలపడనున్న రోహిత్ సేన