PM Internship Scheme : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ 2 వ విడత దరఖాస్తులు స్వీకరిస్తున్న సర్కార్

PM Internship : యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కి సంబంధించి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా 300కి పైగా ప్రముఖ కంపెనీలలో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభించనున్నాయి.

PM Internship Scheme Updates

యువతకు, వారి నైపుణ్యాలను పెంచుకునే అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్‌ ద్వారా అందించడమే కాకుండా, వారికి సరైన శిక్షణ ద్వారా మార్కెట్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పించబడుతుంది. ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 12 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి.

ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా, వారి కెరీర్‌ వృద్ధికి మద్దతు ఇవ్వడం, వారి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సృష్టించడం కూడా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నది.

Also Read : IND vs BAN : 6 వికెట్ల తేడాతో బాంగ్లాదేశ్ ను ఓడించిన భారత జట్టు

Leave A Reply

Your Email Id will not be published!