TESLA-AP : ‘టెస్లా’ సంస్థ ను ఆకర్శించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న ఏపీ
ఇప్పటికిప్పుడు కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పకపోయినా...
AP : అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రేసులోకి దిగింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా(TESLA) కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పడానికి ఆ కంపెనీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఈడీబీ) రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో పోర్టు కనెక్టివిటీతో ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికిప్పుడు కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పకపోయినా.. పోర్ట్ యాక్సె్‌సతో టెస్లా(TESLA) రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకోవడానికి వీలుగా అవసరమైన భూమితో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఆ తర్వాత క్రమంగా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు టెస్లా కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాటరీ తయారీ యూనిట్లు నెలకొల్పడానికి అవసరమైన ఎకోసిస్టమ్ రెడీగా ఉంది. గణాంకాల ప్రకారం భారత్‌లో 60 శాతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
AP Govt Try to Get TESLA
ఇందులో భాగంగానే టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పేందుకు 2017లోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ నెలకొల్పే అంశంపై చర్చలు జరిపారు. ఇప్పుడు ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో భారత్‌లో అడుగు పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Also Read : Group 2 Exams : మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు