Minister Kishan Reddy : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు

ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పారు...

Kishan Reddy : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ పార్టీకి వచ్చేది మాత్రం గాడిద గుడ్డేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోనియా గాంధీ సంతకంతో ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఆ పార్టీ నేతలు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పారు.

Kishan Reddy Slams Congress Party

గత రెండు ప్రభుత్వాలు రూ. 9 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు. మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక సారి గెలిచిన రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీ గెలవడం లేదని ఎద్దేవా చశారు. నిజమైన మార్పు తెలంగాణలో రాలేదని విమర్శించారు.

తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 27వ తేదీన జరగనున్నాయి.వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుంద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. కాదు కాదు.. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందంటూ బీజేపీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొంటున్నారు. అలాంటి వేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : IND vs PAK : 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన పాక్..ప్రెషర్ లో పాక్ ఆటగాళ్లు

Leave A Reply

Your Email Id will not be published!