Minister Konda Surekha :మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కొండాసురేఖ కీలక ట్వీట్

ఇంతకీ మంత్రి సురేఖ చేసిన కామెంట్స్‌ ఏంటి.. కేసీఆర్‌పై విసిరిన పంచ్ డైలాగ్స్‌ ఏంటో చూద్దాం...

Konda Surekha : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీకి రాకపోవడంపై సురేఖ తనదైన శైలిలో సెటైర్ వేశారు. నిన్న జరిగిన భారత్-పాక్ క్రికెట్‌ మ్యాచ్‌‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డును ప్రస్తావిస్తూ మాజీ సీఎంపై పలు వ్యాఖ్యలు చేశారు మంత్రి సురేఖ. కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో లేకపోవడం పెద్ద రికార్డే కదా అంటూ సెటైర్ వేశారు. ఎక్స్‌ వేదికగా కేసీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ మంత్రి సురేఖ(Konda Surekha) చేసిన కామెంట్స్‌ ఏంటి.. కేసీఆర్‌పై విసిరిన పంచ్ డైలాగ్స్‌ ఏంటో చూద్దాం.

Konda Surekha Slams KCR

దుబాయ్ వెదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు మంత్రి సురేఖ. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం అందరం టీవీలో చూసి సంబురపడ్డామన్నారు. 14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అంటూ ఎద్దేవా చేశారు.14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే… 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అంటూ మంత్రి సురేఖ ట్వీట్ చేశారు.

Also Read : YS Jagan : అసెంబ్లీ సమావేశాలపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!