Canada Govt :కెనడా కొత్త వీసా రూల్స్ తో ఉక్కిరి బిక్కిరి లాడుతున్న విదేశీయులు

ఫలితంగా, విదేశీ వర్కర్లు, విద్యార్థుల వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వం అధికారులకు ఇచ్చింది...

Canada : వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కట్ల పాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వర్క్ వీసా, రెసిడెంట్ పర్మిట్లు ఉన్న వారిపై కూడా ఈ ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలతో కెనడా(Canada) సరిహద్దుల వద్ద అధికారులు అనేక విచక్షణాధికారాలు దఖలు పడ్డాయి. ఫలితంగా, విదేశీ వర్కర్లు, విద్యార్థుల వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వం అధికారులకు ఇచ్చింది.

Canada Govt New Visa Rules

తాజాగా నిబంధనల ప్రకారం, కెనడా(Canada) బోర్డర్ అధికారులకు విదేశీయుల వీసాలను రెసిడెంట్ డాక్యుమెంట్లను తిరస్కరించే అవకాశం ఉంది. విదేశీయులు కెనడాను వదిలి తిరిగి వెళ్లరన్న అధికారులకు బలంగా అనిపిస్తే వారి వీసా, ఇతర డాక్యుమెంట్లను తిరస్కరించొచ్చు. దీంతో, విదేశీయుల వర్క్ పర్మిట్లు, విద్యార్థుల వీసాలు రద్దైపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతుల్ని కూడా రద్దు చేసే అధికారం అక్కడి అధికారులకు ప్రభుత్వం ఇచ్చింది. ఇలా అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించొచ్చు. అప్పటికే కెనడాలో ఉంటున్న విదేశీయులకు ఓ తేదీలోపు వెనక్కు వెళ్లాలని నోటీసులు జారీ చేస్తారు.

కొత్త నిబంధనల చుట్టూ ఉన్న అనిశ్చితి అస్పష్టత కారణంగా వేల మంది విదేశీయులపై ప్రభావం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉన్న విషయం తెలిసిందే.భారతీయ విద్యార్థులు, వర్కర్లు అనేక మంది అక్కడ ఉంటున్నారు. ఉన్నత విద్య కోసం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక భారతీయ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో కెనడాకు వెళుతున్నారు. 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే కెనడా ప్రభుత్వం ఎస్‌డీఎస్ వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Also Read : PM Modi Visited : ఒక్క రోజులో 3 రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!