Vivek Ramaswamy : ఒహియో గవర్నర్ పదవికి మద్దతు పలికిన ప్రెసిడెంట్ ట్రంప్, మస్క్
తాజాగా ఒహియో గవర్నర్ అభ్యర్థిగా పోటీ పడబోతున్నట్లు ప్రకటించారు...
Vivek Ramaswamy : భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడ్డ సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ ప్రభుత్వంలో ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)లో ఎలన్ మస్క్‌తో సంయుక్తంగా సారథ్యం వహించే అవకాశం ఆయనకు లభించింది. కానీ, మస్క్‌తో విభేదాల కారణంగా వివేక్ ఆ పదవి చేపట్టేందుకు అంగీకరించలేదు. తాజాగా ఒహియో గవర్నర్ అభ్యర్థిగా పోటీ పడబోతున్నట్లు ప్రకటించారు.ఈ రేసులో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్న ఆయనకు అన్ని వర్గాల నుంచి భారీ మద్ధతు సమకూరుతోంది.
Vivek Ramaswamy Comment
వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఎంట్రీ ఒహియో గవర్నర్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున ఒహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్, మోర్గాన్ కౌంటీకి చెందిన హెథర్ హిల్స్ బరిలో నిలిచారు. ఇక డెమోక్రటిక్ పార్టీ నుండి మాజీ వైద్యవిభాగం డైరెక్టర్ ఎమీ ఏక్షన్ నిలబడటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే వివేక్ రామస్వామికి తమ పూర్తి మద్ధతు, సహకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డోజ్ సారథి ఎలాన్ మస్క్ ప్రకటించారు.
“వివేక్రామస్వామి గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. నాకు ఆయన బాగా తెలుసు. ప్రత్యర్థిగా పోటీ పడ్డాను కూడా. అతడు ప్రత్యేకమైన వ్యక్తి. చిన్నవాడైనా తెలివైనవాడు. చాలా మంచి వ్యక్తి. మన దేశాన్ని చాలా ప్రేమిస్తారు. ఆయన ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతారు. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచరు. నా పూర్తి మద్ధతు నీకే వివేక్!” అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మస్క్ కూడా వివేక్ రామస్వామికి ‘‘గుడ్‌లక్, నా సంపూర్ణ మద్ధతు నీకుంటుంది’’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
2024అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్‌తో అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడి అందరి దృష్టిని ఆకర్షించారు బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి. తర్వాత పోటీ నుంచి వైదొలిగి ట్రంప్‌కు పూర్తి సహకారం అందించారు. అందుకు బదులుగా అధికారంలోకి రాగానే డోజ్ సంయుక్త సారథిగా రామస్వామికి కీలక పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. కానీ, ఈ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు రామస్వామి. తాజాగా ఒహియో గవర్నర్ పదవి కోసం పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : United Nations Support : ఐక్యరాజ్య సమితిలో రష్యాకు మద్దతుగా నిలిచినా అమెరికా