AP MLC Elections 2025 : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న ఫ్యాన్ పార్టీ
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణి చేస్తున్నారు...
MLC Elections : ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల(Godavari Districts) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం(Machilipatnam) నోబుల్ కళాశాల నుంచి ఎన్నికల సామాగ్రిని పొలింగ్ కేంద్రాలకు అధికారులు పంపుతున్నారు. నోబుల్ కాలేజీ నుంచి అవనిగడ్డ, మచిలీపట్నం పెడన నియోజకవర్గాలకు ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నోబుల్ కాలేజీ వద్ద పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఎన్నికల డ్యూటిలు వేస్తున్నారు. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే గుంటూరు(Guntur), ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ తరలిస్తున్నారు.
AP MLC Elections Update
ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామకు ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) సామగ్రిని అధికారులు పంపిణి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది నందిగామ ఆర్డివో కార్యాలయకు చేరుకుంది. నందిగామ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో 12 బూత్‌లు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 10 బూత్‌లు ఏర్పటు చేశారు. నందిగామ నియోజకవర్గంలో 12 బూత్‌లలో 8,958 ఓటర్లు తమ ఓటు హక్కును వినిమెగించుకోనున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం 10 బూత్‌లలో 6,975 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పటు చేశారు.
కాగా ఈ నెల 27న (గురువారం) జరిగే రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 17 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. పోలింగ్ కోసం 8,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని వివేక్ యాదవ్ తెలిపారు.
కూటమి అభ్యర్థులకు మద్దతు.. పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్య ఓట్లు వేయాలి. ఇప్పటికే డీఎస్సీ ప్రక్రియ చేపట్టారు. రెండేళ్లుగా ఆగిపోయిన కానిస్టేబుళ్ల దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించారు. నిరుద్యోగులు, యువతకు కూటమి ప్రభుత్వంలోనే మేలు జరుగుతుంది’ అని సిద్దిక్ అన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారంతో ముగిసింది. ఎలాంటి కవ్వింపులు, దూషణలు, ఆరోపణాస్త్రాలు లేకుండా పట్టభద్రులు హుందాగా వ్యవహరించారు.
Also Read : Preity Zinta Slams : కేరళ కాంగ్రెస్ ట్వీట్ పై భగ్గుమన్న ప్రీతీ జింటా