Maha Kumbh Mela 2025 : నేడు చివరి దశకు చేరిన ప్రయాగరాజ్ మహా కుంభమేళా

ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు...

Maha Kumbh Mela : మహా కుంభమేళా 2025 ఈరోజు (ఫిబ్రవరి 26) చివరి రోజు అయిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకకు ఇప్పటివరకు 65 కోట్లమందికిపైగా భక్తులు హాజరయ్యారు. చివరి రోజు మహాశివరాత్రి సందర్భంగా నాగ సాధువులు కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్లి శివుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలను డ్రోన్ విజువల్స్ ద్వారా షూట్ చేశారు. ఈ వీడియోలో ఒకేసారి అనేక మంది సాధువులు ఒక్కసారిగా వెళ్లిన దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Maha Kumbh Mela 2025 Updates

నాగ సాధువులు కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత, తమ ఆధ్యాత్మిక సాధన కొనసాగించడానికి మళ్లీ హిమాలయాలకు తిరిగి వెళతారు. నాగ సాధువులను సాధారణంగా హిందూ సన్యాసులుగా పరిగణించబడతారు. వీరు సాధారణ జీవనం వదిలేసి ఆధ్యాత్మికతను పాటిస్తూ కఠినమైన ధ్యానం, యోగా, ప్రార్థనలను చేస్తారు. అయితే ఈసారి మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తున్న తరుణంలో మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.

వచ్చే ఐదేళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు.అర్ధ కుంభమేళా అంటే ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి అర్ధ కుంభమేళా 2021లో హరిద్వార్‌లో జరిగింది. ఈ క్రమంలో 2027లో అర్ధ కుంభమేళా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు 12 ఏళ్ల తర్వాత వస్తున్న కుంభమేళా ఈసారి 2027లో నాసిక్‌లో జరగనుంది.

సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం జూలై 17, 2027న ప్రారంభమై, ఆగస్టు 17, 2027న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇది నాసిక్ నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్‌లో జరగనుంది. 2028లో 12 ఏళ్లకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది. ఆ తర్వాత 2030లో ప్రయాగ్‌రాజ్ లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు.

Also Read : SLBC Tunnel : 11 సంస్థలతో 5వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

Leave A Reply

Your Email Id will not be published!