Sudan Plane Crash :నివాస ప్రాంతాలపై కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్..46 మంది దుర్మరణం
రంగంలోకి దిగిన అధికారులు ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు..
Plane Crash : నివాస ప్రాంతాల్లో సైనిక విమానం కుప్పకూలింది.. టేకాఫ్ అయిన కాసేపటికే సైనిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 46మంది సజీవ సమాధి అయినట్టుగా ఒక వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతటి ఘోర విమాన ప్రమాదం సుడాన్లో చోటు చేసుకుంది. ఈ రోజు(ఫిబ్రరి 25న) ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఒక సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 46 మంది సైనిక సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
Plane Crash At Sudan…
రంగంలోకి దిగిన అధికారులు ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : Champions Trophy 2025 :ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఓటమిపై ఆగ్రహించిన మాజీ ప్రధాని