Maharashtra CM-Bomb Threats :మహారాష్ట్ర సీఎం కు పాక్ నంబర్ నుంచి బాంబు బెదిరింపులు

ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భద్రతను కట్టుదిట్టం చేశారు...

Bomb Threats : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌(Devendra Fadnavis)కు పాకిస్థాన్ ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపులు రావడం సంచలనమైంది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో బెదరింపు సందేశం వచ్చినట్టు అధికారులు తెలిపారు. మాలిక్ షాబాజ్ హుమయూన్ రజా అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు వెల్లడించారు. మహారాష్ట్ర సీఎం కార్యాలయం పేల్చాస్తామంటూ సదరు వ్యక్తి బెదిరించినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో వోర్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భద్రతను కట్టుదిట్టం చేశారు.

Maharashtra CM Receives Bomb Threats..

కాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు సైతం గత ఫిబ్రవరి 21న బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు తనకు కొత్తేమీ కాదని షిండే అప్పట్లో వ్యాఖ్యానించారు. డాన్స్ బార్ మూసేసినప్పుడు తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని, కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయని, అయితే తాను భయపడలేదని చెప్పారు. గడ్చిరోలిలో తొలి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినప్పుడు కూడా నక్సలైట్ల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. షిండే కారును బాంబుతో పేల్చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో బుల్దానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : Mumbai Boat Fire : మంటల్లో చిక్కుకున్న చేపల బోట్..చిక్కుకున్న 20 మంది మత్స్యకారులు

Leave A Reply

Your Email Id will not be published!