Drunk and Drive: పోలీస్ స్టేషన్‌ పై నుండి దూకి మందుబాబు ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్‌ పై నుండి దూకి మందుబాబు ఆత్మహత్యాయత్నం

Drunk and Drive : ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) కలకలం రేపుతోంది. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ లారీ డ్రైవర్… ఈ కేసులో పోలీసులు తనను చిత్ర హింసలకు గురిచేసారంటూ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన లారీ డ్రైవర్ జీవన్ ను ఖమ్మం(Khammam) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జీవన్ పరిస్థితి విషమంగా ఉండటంతో లారీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం ఘటన తెలంగాణాలో సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

Drunk and Drive…

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ కాలనీలో పోలీసులు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు వాహనాలను ఆపి వారికి టెస్టులు చేశారు. అతిగా మద్యం తాగి పట్టుపడిన వారిని కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్‌ కు తరలిస్తున్నారు.
అయితే అదే సమయంలో డ్రైవర్ జీవన్ కుమార్ తన లారీ నడుపుకుంటూ పోలీసులు తనిఖీలు చేసే మార్గానికి వెళ్లాడు. జీవన్ పూటుగా మద్యం సేవించి ఉండడాన్ని గమనించిన పోలీసులు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు. దీనితో అతను పరిమితికి మించి మందు తాగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌ కు తీసుకెళ్లారు.

అయితే పోలీసు స్టేషన్ కు చేరుకున్న కొద్ది సమయానికే… పోలీసులు తనపై దాడి చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ జీవన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్టేషన్ భవనం పైకి ఎక్కి అక్కడ్నుంచి ఒక్కసారిగా దూకేశాడు. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. గమినించిన పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. వెంటనే విషయాన్ని జీవన్ కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేశారు. దీంతో వారంతా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యులు బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, డ్రైవర్ జీవన్ కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది.

Also Read : Nara Chandrababu Naidu: మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త !

Leave A Reply

Your Email Id will not be published!