PM Narendra Modi: సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి… ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్‌ నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన వన్‌ తారాను సందర్శించిన మోదీ… ఆ తర్వాత 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం పొరుగున ఉన్న జునాగఢ్‌ జిల్లాలోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యం హెడ్‌క్వార్టర్స్‌ సాసన్‌కు బయల్దేరి వెళ్లారు.

PM Narendra Modi At Somnath Temple

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా కోట్లాది మంది దేశ ప్రజల భాగస్వామ్యంతో ముగిసినట్లు ప్రధాని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఒక సేవకుడిగా… మహా కుంభోత్సవం తర్వాత సోమనాథ్‌ ఆలయానికి వస్తానని అనుకున్నాననీ… ఇందులో భాగంగానే సోమనాథుడిని దర్శించుకొని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.

Also Read : Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు ! పోలీసులకు ఫిర్యాదు !

Leave A Reply

Your Email Id will not be published!