10th Class Hall Tickets: వాట్సాప్ లో పదోతరగతి హాల్‌టికెట్లు ! డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అంటే ?

వాట్సాప్ లో పదోతరగతి హాల్‌టికెట్లు ! డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అంటే ?

10th Class Hall Tickets : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం మధ్యాహ్నం నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి(KV Srinivasulu Reddy) గారు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in)లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అలాగే ఆయా పాఠశాల ద్వారా లాగిన్ చేసుకోవచ్చని తెలిపింది.

SSC పబ్లిక్ పరీక్షల, మార్చి-2025 హాల్ టిక్కెట్లను వాట్సాప్ – మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా తొలిసారిగా ప్రక్రియ ప్రారంభించామన్నారు. మన మిత్ర, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవల ద్వారా (9552300009), విద్యా సేవలను పొందవచ్చని పేర్కొంది. దరఖాస్తు సంఖ్య, విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పదవ తరగతి హాల్ టిక్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి నారా లోకేశ్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌ లో పోస్ట్ లచేస్తూ విద్యార్ధినీ విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్, కీప్ సైనింగ్ అంటూ ట్వీట్ చేశారు.

10th Class Hall Tickets – వాట్సాప్ లో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

• అభ్యర్థులు వారి WhatsApp ద్వారా 9552300009 కి “Hi” అనే సందేశాన్ని పంపాలి.
• “Choose Service” లేదా “సేవను ఎంచుకోండి”పై క్లిక్ చేయాలి.
• తర్వాత “Education Services” లేదా “విద్యా సేవలు”ని ఎంచుకోండి.
• తర్వాత “SSC Hall Ticket”ని ఎంచుకోండి. తర్వాత విద్యార్థి “Application Number” / “Child ID” మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, స్ట్రీమ్‌ను ఎంచుకుని, మీ WhatsApp నంబర్‌లో మీ హాల్ టికెట్‌ను స్వీకరించడానికి “Confirm”పై క్లిక్ చేయండి.
* వివరాలు సరి చూసుకోవాలి*
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్‌లో విద్యార్థుల వివరాలైన పేరు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫోటో, సంతకం, సబ్జెక్టులు మొదలైనవన్నీ పూర్తిగా సరిచూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు తెలిపారు. అభ్యర్థి వివరాల్లో సబ్జెక్టు సరిపోలకపోతే, సంబంధిత ప్రధానోపాధ్యాయులు వెంటనే dir_govexams@yahoo.com లేదా dir_govexams@apschooledu.in ఇమెయిల్ ద్వారా దిగువ సంతకం చేసినవారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Also Read : MLC Election Notification: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల !

Leave A Reply

Your Email Id will not be published!