Amit Shah: మిజోరాం ‘వండర్ కిడ్’కు అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం ‘వండర్ కిడ్’కు అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
Amit Shah : ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) గిటార్ ను బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్ లో ఆమెను రాజ్‌భవన్ కు ఆహ్వనించారు. అనంతరం తనకు గిటార్ అందజేసి… ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Amit Shah Special Gift to
ఎస్తేర్ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ అమిత్ షా ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది.
Also Read : SpaceX: ఐఎస్‌ఎస్‌లోకి చేరుకున్న క్రూ డ్రాగన్ ! త్వరలో భూమి మీదకు సునీత !