Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీస్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీస్
Phone Tapping : తెలంగాణా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో ముఖ్య నిందితుడు అరువెల శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు తెలంగాణా(Telangana) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా వారిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి తాజాగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైనంత తొందరగా తీసుకొచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపులను ముమ్మరం చేశారు.
Phone Tapping Case Updates
వారిపై రెడ్‌కార్నర్ నోటీసుల జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సమాచారం డీహెచ్ఎస్కు చేరితే వారిద్దరిని అమెరికాలో ప్రొవిజినల్(తాత్కాలిక) అరెస్ట్ చేయొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే అవకాశముంది. అయితే ప్రొవిజినల్ అరెస్ట్‌ను అక్కడి న్యాయస్థానంలో వారు సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని నిందితులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. అక్కడ ఊరట లభించకపోతే డిపోర్ట్ చేయడం ఖాయం.
మరోవైపు వీలైనంత తొందరగా నిందితులను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతోపాటు, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. డీహెచ్ఎస్కు సమాచారం అందగానే అమెరికాలో పొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక అరెస్ట్ ) చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ పంజాగుట్టలో ఫోన్ ట్యాంపింగ్ కేసు నమోదు కాగానే నిందుతులు అమెరికా పారిపోయిన సంగతి తెలిసిందే.
Also Read : Smita Sabharwal: స్మితా సభర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ యూనివర్శిటీ