Anna Canteen: అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్ శాంతారావు
అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్ శాంతారావు
Anna Canteen : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వ్యవస్థాపక ఛైర్మన్ నార్నే రంగారావు సతీమణి డాక్టర్ శాంతారావు తన ఉదారతను చాటుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందజేశారు. తన భర్త జ్ఞాపకార్థం ఆమె సీఎం చంద్రబాబును కలిసి రూ.1,00,01,016 విరాళం చెక్కును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ‘అన్న క్యాంటీన్(Anna Canteen)’ తిరిగి ప్రారంభించిన సమయంలో నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చి తనకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె తెలిపారు.
Anna Canteen Got 1cr Donations
అనారోగ్యం కారణంగా చనిపోవడానికి ఒకరోజు ముందు రూ. కోటి విరాళం అందించే విషయాన్ని నార్నే రంగారావు ఆమెకు గుర్తు చేయగా… ఆయన మరణానంతరం తన కుమార్తె, నార్నే ఎస్టేట్స్ డైరెక్టర్ అడుసుమిల్లి దీప, వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్ తో కలిసి వచ్చిన డాక్టర్ శాంతారావు ఈ విరాళాన్ని సీఈవో నార్నే గోకుల్ తోడ్పాటుతో సీఎం చంద్రబాబుకు అందజేశారు. దీనితో ఆ కుటుంబాన్ని సీఎం అభినందించారు. పేదలకు రూ.5కే అన్నం పెట్టాలనే ఆలోచనకు… ఇలాంటి వారి గొప్ప మనసు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఎంతో నిజాయతీగా, ఆదర్శంగా జీవితాన్ని గడిపిన నార్నే రంగారావు కాలం చేయడానికి ఒకరోజు ముందు కూడా అన్న క్యాంటీన్ విరాళం గురించి భార్యకు గుర్తు చేయడం ఆయన సహృదయానికి నిదర్శనమని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన సేవల్ని స్మరించుకుంటూ… అన్న క్యాంటీన్(Anna Canteen)కు విరాళం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Kesineni Nani : డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు