Mamata Banerjee: యూకే పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేదు అనుభవం

యూకే పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేదు అనుభవం

Mamata Banerjee : యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) చేదు అనుభవం ఎదురయింది. లండన్‌ లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని కెల్లాగ్‌ కాలేజీలో ‘సామాజిక అభివృద్ధి – మహిళా సాధికారత’ అంశంపై మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్‌ లో ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్జీ కర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనపై వారు నిరసన వ్యక్తంచేశారు. ఆర్జీకర్‌లో విద్యార్థిని హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.

Mamata Banerjee Shocked

అయితే నిరసనకారులకు దీదీ(Mamata Banerjee) ధీటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ… ‘‘మీరు చెప్పేది వినబడట్లేదు. గట్టిగా చెప్పండి. ఆ కేసు పెండింగ్‌లో ఉందని మీకు తెలుసా ? దాని దర్యాప్తు ఇప్పుడు మా చేతుల్లో లేదు. కేంద్రమే ఆ బాధ్యత తీసుకుంది. ఇక్కడ రాజకీయాలు చేయకండి. రాజకీయాలకు ఇది వేదిక కాదు. నేను దేశం తరఫున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించినట్లే’’ అని గట్టిగా బదులిచ్చారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మమతా బెనర్జీ 1990ల నాటి ఓ ఫొటోను ప్రదర్శించారు. తీవ్ర గాయాలతో తలకు కట్టుతో ఉన్న తన ఫొటోను ఆమె చూపించారు. ‘‘ముందు ఈ చిత్రాన్ని చూడండి. నన్ను చంపేందుకు ఎలాంటి కుట్రలు, యత్నాలు జరిగాయో తెలుసుకోండి’’ అని అన్నారు. ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరని దీదీ ఈ సందర్భంగా తెలిపారు.

మమత సమాధానంతో సభలోని వారంతా చప్పట్లతో అభినందించారు. ఆ టైంలో సభలో ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రొత్సాహాం నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసింది. దీదీ.. ఎవరినీ పట్టించుకోదు. దీదీ ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌. ఒకవేళ పట్టుకోవాలనుకుంటే.. పట్టుకోండి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అనంతరం నిర్వాహకులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించేశారు. ఆ టైంలో వేదికపై క్రికెట్‌ దిగ్గజం సౌరబ్‌ గంగూలీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Also Read : Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట

Leave A Reply

Your Email Id will not be published!