Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి వివాదంపై టీడీపీ అధ్యక్షులు షాకింగ్ కామెంట్స్

ఎమ్మెల్యే కొలికపూడి వివాదంపై టీడీపీ అధ్యక్షులు షాకింగ్ కామెంట్స్

Palla Srinivasa Rao : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్… టీడీపీ(TDP) నేత రమేష్ రెడ్డి వ్యవహారం… తెలుగుదేశం పార్టీకు తలనొప్పిగా మారింది. గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన… రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే… రాజీనామా చేస్తానని కొలికపూడి పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు ముగియడంతో తిరువూరు వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం తిరువూరు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasa Rao)కు వ్యతిరేకంగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఒకటయ్యారు. టీడీపీ నేత రమేష్ రెడ్డికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. డౌన్ డౌన్ కొలికపూడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరువూరుకు కొలికపూడి వద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

దీనితో తిరువూరు కార్యకర్తలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) సముదాయించారు. అనంతరం ముఖ్య నేతలతో పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా పార్టీయే సుప్రీమ్, పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోము. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కొలికపూడిపై ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి వ్యవహారం తమ దృష్టికి ఇంకా రాలేదని పల్లా శ్రీనివాస్ తెలిపారు. రమేష్ రెడ్డిపై ఎవరూ కూడా తమకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయని… తిరువూరు వ్యవహారం కూడా అలాంటిదేనని చెప్పారు. త్వరలోనే తిరువూరు సమస్యను పరిష్కరిస్తామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Palla Srinivasa Rao – తిరువూరులో కొనసాగుతున్న ఉత్కంఠ

టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే కొలికపూడి ఇచ్చిన డెడ్ లైన్ శనివారం ఉదయం 11 గంటలకు పూర్తి అయింది. దీనితో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌ గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే కొలికపూడి బహిరంగ సవాల్ విసిరారు. దీనితో తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. బోసుబొమ్మ సెంటర్ వేదికగా జరగనున్న పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. పోలీస్, ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసులు మోహరించారు.

Also Read : CM Chandrababu Naidu: ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Leave A Reply

Your Email Id will not be published!