Weather Update: ‘క్యుములోనింబస్’ ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
‘క్యుములోనింబస్’ ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
Weather Update : క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయని వెల్లడించింది.
Weather Update for Telangana
సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 10న అంటే గురువారం రాష్ట్రంలోని సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు