Minister Uttam Kumar Reddy : సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు కేంద్రానుమతిపై స్పందించిన మంత్రి

పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు.

Uttam Kumar Reddy : సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇది తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో లాండ్ మార్క్ డెవలప్‌మెంట్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. శనివారం నాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఏడాదిన్నర కృషి ఫలించిందన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇది ముందడుగని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు చాలా కాలంగా గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గోదావరి నదీ జలాలలో 68 టీఎంసీలు.. 8 లక్షల ఎకరాలకు ఉపయోగమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మేడిగడ్డ కూలిపోయిందని..సీతమ్మ సాగర్ నిలబడుతుందా అని కేంద్రం అడిగిందన్నారు. సీడబ్ల్యూసీకి అన్ని వివరాలు పంపితే అప్పుడు అప్రూవల్ ఇచ్చారని వెల్లడించారు.

Minister Uttam Kumar Reddy Responds

పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ముంపు నష్టం.. ప్రొటెక్షన్ వాల్ కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని అడిగామని.. అందుకు కేంద్రం కొంత అనుకూలంగా ఉందని తెలిపారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్‌ఎస్ ద్రోహం చేసిందని విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై బీఆర్‌ఎస్ మాట్లాడే తీరు ఖండిస్తున్నామన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తాము ప్రాజెక్ట్ మొదలుపెట్టామని.. బీఆర్‌ఎస్ తమకు పేరు వస్తుందని రీడిజైన్ చేసి… లక్షన్నర కోట్లకు పెంచారని అన్నారు. కాళేశ్వరం కట్టిన డబ్బు బీఆర్‌ఎస్ వాళ్ళ జేబులో నుంచి కట్టలేదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ తాకట్టు పెట్టి మరీ కట్టారని మండిపడ్డారు. వాళ్ళే కట్టారు.. వాళ్ల హయంలోనే కూలిందని అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ చూస్తే ఎంత దుర్మారం చేశారో అర్థం అవుతోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌లో విషయాలు తెలంగాణ ప్రజలు గుర్తించాలని అన్నారు.

Also Read : Pahalgam Attack-Pakistan PM : పహల్గామ్ దాడిపై మొదటిసారి స్పందించిన పాక్ ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!