Minister Nara Lokesh: నమో దెబ్బకు వంద పాకిస్తాన్లు వచ్చినా తోకముడవటం ఖాయం – మంత్రి నారా లోకేష్
నమో దెబ్బకు వంద పాకిస్తాన్లు వచ్చినా తోకముడవటం ఖాయం - మంత్రి నారా లోకేష్
Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు… వంద పాకిస్థాన్‌లు వచ్చినా తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. పాకిస్తాన్ గీత దాటి, అమాయకులని చంపి చాలా పెద్ద తప్పు చేసిందన్నారు. ఒక్క పాకిస్తాన్ కాదు… వంద పాకిస్తాన్లు వచ్చినా కూడా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేవని చెప్పారు. వంద పాకిస్తాన్ లకు సమాధానం చెప్పగలిగే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉందని, ఆ మిస్సైల్ నరేంద్ర మోదీ అని కొనియాడారు. సింహం ముందర ఆటలు ఆడకూడదు… ఆడితే మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ మిస్సింగ్ కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో పని చేసే వారు కొంతమంది రాజీనామాలు చేశారని, మరికొంతమంది సెలవులో వెళ్లిపోయారని చెప్పారు. అది నరేంద్ర మోదీ పవర్ అంటూ కొనియాడారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీకి మద్దతు ఇస్తోందన్నారు.
Nara Lokesh – మోదీకి అండగా ఉంటాం – చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఉగ్రవాదులను అణిచివేయటం కోసం ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. గతంలో మోదీ గారెని ఎప్పుడు కలిసినా… చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ, మొన్న అమరావతి కార్యక్రమానికి పిలవడానికి వెళ్లాను. ఆ మీటింగ్ చాలా గంభీరంగా సాగింది. ‘ నా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు’ అన్న ఆవేదన మోదీ గారిలో చూశాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మేము అండగా ఉంటాం’ అని స్పష్టం చేశారు.
Also Read : PM Narendra Modi: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన